BREAKING
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం కరోనా సేవలను గుర్తు చేసుకున్న స్థానికులు.. కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్ ఓటేరులో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక

రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్...

Select Suryaa Now
రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్...
సూర్య నిజామాబాద్  : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినముల సందర్భంగా (పోలీస్ ఫ్లాగ్ డే) నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు" రక్తదాన శిబిరం" కార్యాక్రమం ఉదయం 10 గంటలకు నిర్వహించగా ముఖ్య అతిధులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ హజరుకావడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... సిబ్బంది చేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానం అవుతుందని, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని ప్రతీ ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవవలలో పాల్గొని తోటి వారి ప్రాణాలను కాపాడటములో తమ వంతు సహయముగా రక్తదానం చేయడం అనేది ఒక సామాజిక కార్యక్రమం అని ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. మీరు ఒకరి ప్రాణం కాపాడినవారు అవుతారని తెలియజేశారు.ఈ రక్తదానం చేయడం ద్వారా మనం ఎందరికో కొత్తజీవం అందించిన వారు అవుతారు అని అన్నారు.ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 155 యూనిట్ల రక్తాన్ని సేకరించాడం జరిగింది.ఈ రక్తదాన శిబిరంలో నిజామాబాద్ అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాష్ , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ చైర్మన్ పోతంకర్ లక్ష్మీనారాయణ , వైస్ చైర్మన్ డా. శ్రీను నాయక్, మెడికల్ ఆఫీసర్ డా.రవీంద్రనాథ్ సూరి,యూనిట్ మెడికల్ ఆఫీసర్ డా.సరళ , నిజామాబాద్ ఏ.సి.పి ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లేష్,మరియు రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు,ఎం.టి.ఓ, సీ.ఐలు ఆర్.ఎస్.ఐలు, ఎస్సైలు,మరియు పోలీస్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్,స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.