ఓటేరులో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
తిరుపతి రూరల్ మండలం ఓటేరు పంచాయతీకి చెందిన టీడీపీ నేత డి.రెడ్డెప్ప గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు గురుమూర్తి, నాగేశ్వరరావు, రాజ, మహేష్, సాయికుమార్‌లు అతనిని పార్టీలోకి తీసుకు వచ్చారు. తుమ్మల గుంటలోని చెవిరెడ్డి నివాసానికి రావడంతో చంద్రగిరి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా వున్నానని చెప్పారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
H. Dwaraka, staff reporter
Cell 9705347341