కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి
చిత్తూరు అభివృద్ధికి కూటమి మేయర్ అభ్యర్థికి మద్దతు తెలపండి
ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్.
చిత్తూరు నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి మేయర్ అభ్యర్థి కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజల్లోకి వెళ్లి అభ్యర్థికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గురువారం చిత్తూరు వాణిజ్య విభాగం అధ్యక్షులు బి గోపాల్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు గజపాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, చిత్తూరు నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యత కల్పించాలంటే ప్రజల మద్దతు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో కూటమి మేయర్ అభ్యర్థి కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలను కలుసుకుంటూ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నగర అభివృద్ధి లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలు తమ విలువైన ఓటును అభివృద్ధికి తోడ్పడే అభ్యర్థికి వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏడవ డివిజన్ టిడిపి నాయకులతోపాటు కూటమి నాయకులు కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.