BREAKING
ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు! పిల్లలకు పదే పదే తీపి పానీయాలు ఇస్తున్నారా.. ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవు జ్ఞాన పరంపరకు అవధానం మూల స్తంభం

తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం కరోనా సేవలను గుర్తు చేసుకున్న స్థానికులు..

Select Suryaa Now
తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం  కరోనా సేవలను గుర్తు చేసుకున్న స్థానికులు..

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
తిరుచానూరులో గురువారం రెండో రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రంగనాథ వీధి నుంచి ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన.. తిరుచానూరు–2 ఎంపీటీసీ అభ్యర్థి సోనీతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. జడ్పీటీసీ అభ్యర్థిగా తనకు, ఎంపీటీసీ అభ్యర్థిగా సోనీకి ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

అడుగడుగునా ఆత్మీయ స్వాగతం

ప్రచారంలో భాగంగా ఆయా వీధుల్లో పర్యటించిన హర్షిత్‌రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పలుచోట్ల మహిళలు హారతులు ఇచ్చి ఆహ్వానించారు. ప్రతి ఇంటి గడప వద్దకు వెళ్లిన ఆయన ఓటర్లకు నమస్కరిస్తూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించిన బ్యాలెట్‌ నమూనాలను పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తూ ఓటు వేయాల్సిన విధానాన్ని వివరించారు.

కరోనా సేవలను గుర్తు చేసుకున్న ప్రజలు

ఎన్నికల ప్రచారంలో పలువురు స్థానికులు కరోనా కష్టకాలంలో చెవిరెడ్డి కుటుంబం అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆపద సమయంలో తమకు అండగా నిలిచిన చెవిరెడ్డి కుటుంబానికి మద్దతుగా ఉంటామని కొందరు మహిళలు, స్థానికులు పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో చెవిరెడ్డి కుటుంబానికి మద్దతుగా నిలవలేకపోయామని, ఈసారి హర్షిత్‌రెడ్డికి అండగా ఉంటామని పలువురు మహిళలు చెప్పినట్లు ప్రచార బృందం వెల్లడించింది.

టిఫిన్‌ సెంటర్‌లో దోసెలు వేసిన హర్షిత్‌రెడ్డి

ప్రచారంలో భాగంగా ఓ టిఫిన్‌ సెంటర్‌ వద్ద హర్షిత్‌రెడ్డి స్వయంగా దోసెలు వేసి అక్కడివారిని ఆకట్టుకున్నారు. స్థానికులతో కలిసిమెలిసి మాట్లాడుతూ తన ప్రచారాన్ని కొనసాగించారు. ప్రజలతో మమేకమవుతూ ఓటర్ల మద్దతు కోరారు.

ఐదు ఎంపీటీసీ సెగ్మెంట్లలో ప్రచారం

తిరుచానూరు–2, తిరుచానూరు–3, తిరుచానూరు–4, తిరుచానూరు–5, తిరుచానూరు–6 ఎంపీటీసీ సెగ్మెంట్లతో పాటు ముండ్లపూడి, బ్రాహ్మణపట్టు పరిధిలో ఆయా ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

H. Dwaraka, staff reporter 

9795347341.