శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :
కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్టీయూఏ ప్రాంతీయ స్థాయి మహిళల చెస్ క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. గురువారం కళాశాలలో జరిగిన ఈ ఎంపికల్లో జేఎన్టీయూఏ పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి పాల్గొన్న క్రీడాకారిణుల్లో ప్రతిభకనబరిచిన ఆరుగురు విద్యార్థినులు తదుపరి స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థినులను కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్రెడ్డి, జేఎన్టీయూఏ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ నారాయణరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాసు, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్