కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: నగరపాలక సంస్థ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి తరపున 64, 65 డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అన్నా మల్లీశ్వరి, కే రేవతి లను గెలిపించాలని కోరుతూ గురువారం శాప్ చైర్మన్ రవి నాయుడు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నా అనితతో కలసి విస్తృతంగా ప్రచారం చేశారు. జీవకోనకు చేరుకున్న రవి నాయుడుకు స్థానిక మహిళలు కర్పూర హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి తోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ప్రతి ఇంటి గోడకు స్టికర్లను అతికించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు అన్నా రామకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, సురేష్, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్