BREAKING
నర్సాపురం పరిధిలో అర్నబ్ తుఫాన్ బీభత్సం. నర్సాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీ.. శంషాబాద్‌లో ఇన్నోవా కారు బీభత్సం.. మలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టి పల్టీలు, ఒకరికి తీవ్ర గాయాలు! రిషికేశ్‌లో కాంగ్రెస్ న్యాయ యాత్ర హోరు.. నటరాజ్ చౌక్ నుంచి త్రివేణి ఘాట్ వరకు భారీ ర్యాలీ, బీజేపీ ప్రభుత్వ విధానాలపై నిరసన గళం! ఢిల్లీలో మాతా భగవతీ దేవి శర్మ జన్మ శతాబ్ది ఉత్సవాలు: అఖండ దీపం వందేళ్ల సంబరాలు వాస్కో సండే మార్కెట్ అగ్నిప్రమాదంపై గోవా సీఎం సమీక్ష.. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాస చర్యలకు ఆదేశం! సీఏక్యూఎమ్ ‘పవన్’ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన: వాయు నాణ్యత చర్యలపై కేంద్రం ఫోకస్ వాయవ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల పంజా.. వేర్వేరు దాడుల్లో ఐదుగురు పోలీసుల దుర్మరణం, భద్రతా బలగాల తీవ్ర గాలింపు చర్యలు! జీఎస్ఎల్‌వీ-ఎఫ్18 మిషన్ ప్రయోగం: మరింత బలోపేతం కానున్న స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ వాడిలాల్ లాభాల్లో 64% జంప్: ₹463 కోట్లకు చేరిన ఆదాయం షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకున్న నెటిజన్లు: హాంకాంగ్ సిక్సెస్ ట్వీట్‌పై ట్రోలింగ్ జియో ప్లాట్‌ఫామ్స్ లాభాల్లో జోరు: ₹218.8కి పెరిగిన సగటు ఆదాయం క్యూ2 ఫలితాలు: జియో లాభం 8% అప్, పీబీ ఫిన్‌టెక్ లాభాల్లో 43% దూకుడు ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం

ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం

Select Suryaa Now
ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి  -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ  -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్  -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల   -ముగిసిన కూటమి ప్రచార పర్వం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : కార్పొరేషన్ ఎన్నికల ప్రచార ఘట్టం శుక్రవారం ఐదు గంటలకు ముగిసింది. ప్రచారంలో భాగంగా కూటమినేతలు కొర్లగుంట జంక్షన్ లో ఏర్పాటుచేసిన ముగింపు ర్యాలీ జన ప్రభంజనం సృష్టించింది. నగరంలోని వేలాదిమంది కూటమినేతలు, కార్యకర్తలు, జేబీ అభిమానులతో కొర్లగుంట జంక్షన్ నిండిపోయింది. అనంతరం అక్కడికి చేరుకున్న ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కు వందమంది హిజ్రాలు గుమ్మడికాయలతో దిష్టి తీసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రతి కార్యకర్తను ఆప్యాయంగా పలకరించి భరోసాని ఇచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ప్రచారాన్ని పండుగల నిర్వహించామని, ప్రజల నుంచి విశేష స్పందన లభించడం తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. గత రాక్షస పాలన ఎలా బుద్ధి చెప్పారో ఆదివారం జరిగే ఎన్నికలలో వైసీపీకి అదేవిధంగా బుద్ధి చెప్పి కూటమికి పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. మీ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎవరికి భయపడాల్సిన పనిలేదని హామీ ఇచ్చారు. గత రాక్షస పాలనను ప్రత్యక్షంగా చూసి నగర ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం నగరాభివృద్ధి, ప్రజల శ్రేయసే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, రెండు కళ్ళుగా కూటమి ప్రజా పాలను కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. నగరంలోని 66 డివిజన్లు కూటమినేతలను అత్యధిక మెజారిటీతో గెలిపించి కానుక సీఎం చంద్రబాబుకు కానుకగా అందిద్దామని పిలుపునిచ్చారు. 

హోరెత్తించిన జేబి ప్రచార ర్యాలీ…

నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా కూటమినేతలు నిర్వహించిన భారీ ర్యాలీ అంబరాన్ని అంటింది. కొర్లగుంటలో సుమారు కిలోమీటర్ మేరా కూటమినేతలు కార్యకర్తలు, జేబీ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. 59వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్, తన మద్దతు దారులతో భారీ క్రేన్ ద్వారా గజమాలను జేబీ మెడలో వేసి ఘనంగా సత్కరించారు. వేలాదిమంది అభిమానులు మధ్య జేబీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నగరంలో కూటమి గాలి బలంగా ఉందని, ఇందుకు ఇది ఒక సంకేతమని కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ హర్షం వ్యక్తం చేశారు. 

అడుగడుగునా జేబికి బ్రహ్మరథం..

జరిగిన భారీ ర్యాలీలో కొర్లగుంట మెయిన్ రోడ్ లో జరిగిన భారీ ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జేబీకి అడుగడుగునా మంగళ హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. అలాగే తన మద్దతు ధరలు గజ పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన తనకు లభించిన ఘన స్వాగతం హర్షనీయమని, కార్యకర్తలను అభివృద్ధిస్తూ ఆదివారం జరిగే ఎన్నికలలో శ్రమించి కూటమినేతులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని సూచిస్తూ వారిని వెన్ను తట్టు ప్రోత్సహించారు. 

ర్యాలీకి హాజరైన అతీరత మహారధులు..

ఎన్నికల ప్రచార అంకం ముగింపు సందర్భంగా కూటమి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీకి జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల శ్రీధర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టిడిపి పార్లమెంట్ అధ్యక్షురాలు పనభాకలక్ష్మి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, ఎస్ వి బి సి చైర్మన్ శ్రీధర్ వర్మ, ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవి నాయుడు, జనసేన పార్టీ రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు ఆరణి మదన్ హాజరయ్యారు. ర్యాలీలో పాల్గొన్న జన సందోహాన్ని చూసి కూటమి భారీ విజయం చెరువులో ఉందని చర్చించుకున్నారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న ప్రతి కార్యకర్తను అభివాదం చేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత, తాతయ్య గుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, కార్పొరేటర్ అభ్యర్థులు ఆర్ సి మునికృష్ణ, బ్యాంకు శాంతమ్మ,రాజారెడ్డి, జగదీష్, గాలి కావ్య, ఎం రాజేష్, శ్రీహరి నాయుడు, ఆకేపాటి సుభాషిని, సీనియర్ నాయకులు బుల్లెట్ రమణ, బీజీకే యాదవ్, రాజారాం, బీసీ సెల్ నగర్ అధ్యక్షులు విశ్వనాథం, ఆల్వార్ మురళి, కటారి మోహన్, సుబ్బు, రవి, చంద్రన్న, మురళీ, హరీష్, మోహన్ నాయుడు, మంగళం నాని, రామ్మూర్తి రాయల్, కటారి మోహన్, సుబ్బు, రవి, చంద్రన్న, మురళీ, హరీష్, మోహన్ నాయుడు, కుటుంబ కార్యకర్తలు స్థానిక ప్రజలు, జేబి అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్