ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ప్రాచ్య కళాశాలలో గత ఐదు రోజులుగా జరిగిన అవధాన అవగాహన కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా శతావధాని విద్యావాచస్పతి డాక్టర్ తాతా సందీప్ శర్మ అష్టావదానం వీక్షకులను అలరించింది. పృచ్ఛకుల ప్రశ్నలకు తనదైనశైలిలో సమాధానాలిస్తూ ఆష్టావధానం పూర్తి చేశారు. అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ సీతారామరావు మాట్లాడుతూ కళాశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు అవధానులుగా కవులుగా విద్యాంసకులుగా రాణిస్తున్నారని చెప్పారు. కళాశాలలో అష్టావధాన కార్యక్రమం నిర్వహించడం టీటీడీకి గర్వకారమని తెలిపారు. అనంతరం ఎస్వీయూ విశ్రాంత ఆచార్యులు దామోదర్నాయుడు మాట్లాడుతూ ప్రాచ్చ కళాశాల నుంచి ఎంతోమంది అష్టావధానులు, శతావధానులు, సహస్రావధానులుగా రాణిస్తున్నారని కొనియాడారు. విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకుని లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అవధాన సంచాలకులు ఆముదాల మురళి, ఉప్పల దడియం భరత్ శర్మ, మాడుగుల అనీల్కుమార్, గోవిందయ్య, యశ్వంత్ దీక్షితులు, గుమ్మడి రవీంద్ర, ఉమామహేశ్వర్రావు, పురుషోత్తం, భాస్కరశర్మ, సంజీవ్డ్డి, ఏలుమలై, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్