ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం
ఎడ్యుకేషన్ స్టాప్ రిపోర్టర్ : ఎయిర్ బైపాస్ రోడ్డు లోని పి ఎల్ ఆర్ కన్వెన్షన్ హాల్లో తొమ్మిది రోజులు పాటు ఏర్పాటుచేసిన షాపింగ్ ఫెస్టివల్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సినీ తార హెబ్బా పటేల్ హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. విజ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండుగలైనా, శుభకార్యాలైనా.. కుటుంబ అవసరాలైనా.. షాపింగ్ కోసం వేర్వేరు షాపులు చుట్టూ తిరగాల్సిన టెన్షన్ ఇక లేదు. అన్ని రకాల ఉత్పత్తులను ఒకే ప్రాంగణంలో శుభప్రదం షాపింగ్ మాల్ అందుబాటులో తీసుకొచ్చిందన్నారు. ఇది కేవలం బట్టల ప్రదర్శన మాత్రమే కాదు కుటుంబానికి కావాల్సిన అన్ని దొరికే మెగా మాల్ లాంటిది అన్నారు. మహిళల కోసం సాంప్రదాయ రుచులకు తగ్గ పట్టుచీరలు, డిజైనర్ చీరలు, అత్యాధునిక ఫ్యాషన్ దుస్తులు, చిన్నారుల కోసం ప్రత్యేక డిజైన్లతో కిడ్స్ వేర్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పెద్దలకు అనువైన ఫార్మల్ క్యాజువల్ దుస్తులు, ఇంటికి కావలసిన గృహాల అలంకరణ సామగ్రి, గృహోపకరణాలు, నిత్యవసర వస్తువులు వ్యక్తిగత వినియోగ ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో లభిస్తాయి అన్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అవసరమైన వస్తువులను ఒకే వేదికపై పరిశీలించి, కొనుగోలు చేసేలా స్టాళ్లను అందంగా తీర్చిదిద్దారు. ప్రదర్శనను ప్రారంభించిన హెబ్బా పటేల్ వివిధ స్టాళ్లను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించారు. విభిన్న అవసరాలకు అనుగుణంగా ఇన్ని రకాల ఉత్పత్తులను ఒకే వేదికపై అందుబాటులో ఉంచడం అభినందినీయమన్నారు. ఆకర్షణీయమైన ధరలు, ప్రత్యేక రాయితీలు ఈ ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని పేర్కొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్