జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా జీవిద్దామని ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏపీ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ తాతిరెడ్డి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆర్కే విద్యా సంస్థలో శుక్రవారం జీర్ణం కాని పదార్థాలు, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆర్కే విద్యా సంస్థలు విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లేస్, కురుకురే, బిస్కెట్ల వంటి జంక్ తినుబండారాల వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు. పిల్లల జీవన ప్రమాణం తగ్గుతుందని సంస్థ డైరెక్టర్ ఆర్కే విమల హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎనిమిదో తరగతి విద్యార్థిని గలీం జింక్ ఫుడ్ చాటును ప్రదర్శించి దాని నష్టాలను వివరించారు. అలాగే ఎనిమిదో తరగతి విద్యార్థిని వేద కూరగాయలు, పండ్లు వంటి సంపూర్ణ ఆహారాన్ని చూపిస్తూ వాటి లాభాలను తెలియజేశారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామసభల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజల ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలియజేశారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్