BREAKING
వాడిలాల్ లాభాల్లో 64% జంప్: ₹463 కోట్లకు చేరిన ఆదాయం షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకున్న నెటిజన్లు: హాంకాంగ్ సిక్సెస్ ట్వీట్‌పై ట్రోలింగ్ జియో ప్లాట్‌ఫామ్స్ లాభాల్లో జోరు: ₹218.8కి పెరిగిన సగటు ఆదాయం క్యూ2 ఫలితాలు: జియో లాభం 8% అప్, పీబీ ఫిన్‌టెక్ లాభాల్లో 43% దూకుడు ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం నేటి పంచాంగం 30 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –30 అక్టోబర్ 2026 గెలుపు నీదనయ్య శంకర -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం ఏసీ గదిలో గంటల తరబడి ఉంటున్నారా? మీ చర్మం మరియు కళ్లపై పడే తీవ్ర ప్రభావాలు ఇవి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Select Suryaa Now
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

కమలాపూర్ , మేజర్ న్యూస్, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అకస్మిక తనిఖీ చేశారు. వంటగదిలో ని మధ్యాహ్నం భోజనానికి తయారు చేసిన వంటలను, భోజన పదార్థాల నాణ్యతను పరిశీలించారు. బియ్యం, కూరగాయలు ఇతర నిత్యవసరాల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులు డార్మెటరీ గదులను, మూత్రశాలలను పరిశీలించారు. విద్యార్థునులకు అందుబాటులో ఉన్న పుస్తకాలను పరిశీలించి వాటి వివరాలను ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ హాస్టల్ లో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు. వంటగది, భోజనశాల, డార్మెటరీ, మూత్రశాలల నిర్వహణ మెరుగ్గా ఉండాలని, పరిశుభ్రత ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. దోమలు రాకుండా డోర్లకు మెష్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.

రిపోర్టర్; పవన్, కమలాపూర్, హనుమకొండ జిల్లా