బూరుగుపేట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ శ్రీధర్ రావు
వెంకటాపూర్(రామప్ప), మేజర్ న్యూస్,
తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్పంచ్ రూ.2 లక్షలు డ్రా చేశారని బూరుగుపేట ఉప సర్పంచ్ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వెంకటాపూర్ మండలం బూరుగుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం డీఎల్పీఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ రికార్డులు, ఎంబీ బుక్స్, బ్యాంక్ స్టేట్ మెంట్లు, చెక్ రిజిస్టర్లను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. సర్పంచ్, ఉప సర్పంచ్ ల నుంచి వేర్వేరుగా వివరణ తీసుకున్నారు. నకిలీ బిల్లులు, బినామీ పాలనపై వచ్చిన ఫిర్యాదులపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పూర్తి నివేదికను రెండు రోజుల్లో కలెక్టర్ కు అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు.
రిపోర్టర్ ;రఫీ, వెంకటాపూర్ ,ములుగు జిల్లా