దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్
బయ్యారం, మేజర్ న్యూస్, మాజీ ప్రధానమంత్రి,ఉక్కు మహిళగా పేరుగాంచిన దివంగత ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ ఘనంగా నివాళులర్పించారు.శనివారం బయ్యారం మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆమెకు అంజలి ఘటించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత,అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.పేదలు,బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని అన్నారు.దేశ అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆమె చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానేతగా ఇందిరాగాంధీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొంటూ ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య,సొసైటీ చైర్మన్ మల్లయ్య,ఉపసర్పంచ్ ఉమా,తగిర సత్తిరెడ్డి, బీరెడ్డి శ్రీను, రామసహాయం బిక్ష్మా రెడ్డి,నందగిరి భద్రయ్య,తాటి జనార్దన్,పులి మల్లయ్య,జల్లిక శ్రీకాంత్,గుంజ రాకేష్,గుంజ రాంబాబు,కిన్నెర విజయ్,చింత కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్, స్వామి బయ్యారం, మహబూబాద్ జిల్లా