పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని
స్టేషన్ ఘనపూర్, మేజర్ న్యూస్,
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోనిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ సబ్జెక్ట్ టీచర్ గా పని చేస్తున్న కె.రజని పాఠశాలకు 40,000 రూపాయల విలువగల ప్రింటర్ కంప్యూటర్ ను శనివారం బహుకరించారు.ఈ సందర్భంగా టీచర్ రజని మాట్లాడుతూ తాను పని చేస్తున్న పాఠశాలకు తన వంతుగా ప్రింటర్ కంప్యూటర్ అందజేయడం
తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
ఈకార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి కుసుమ రమేష్, ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్,శ్రీకాంత్,లక్ష్మీ ప్రసాద్,రమేష్,కృష్ణవేణి,అరుణ, శ్రీదేవి,సురేఖ,రవి,రాధాకృష్ణ, శ్రీనాధ్, నళిని భాయి తదితరులు పాల్గోన్నారు.
రిపోర్టర్; మోహన్, స్టేషన్గన్పూర్, జనగామ జిల్లా