రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు
స్టేషన్ ఘనపూర్, మేజర్ న్యూస్, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని నూతన గాంధీ విగ్రహం వద్ద నుంచి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆనుకుని బస్టాండ్ వరకు చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులకు మున్సిపాలిటీ అధికారులు శనివారం మార్కింగ్ వేశారు.గాంధీ విగ్రహం వద్దనుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు 60 ఫీట్లు అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నుంచి బస్టాండ్ వరకు 40 ఫిట్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా రోడ్డు విస్తరణకు అడ్డుగాఉన్నటువంటి ఇల్లు,ప్రహరీ గోడలను,మెట్లను తొలగించడానికి మార్కింగ్ వేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా రోడ్డుకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు సహాకరించాలని
అధికారులు కోరారు.ఈ కార్యక్రమంలో సానిటరి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాయి,టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ చుక్క లింగయ్య, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ ;మోహన్, స్టేషన్ ఘన్పూర్ జనగామ జిల్లా