BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి

Select Suryaa Now
ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి

కమలాపూర్ , మేజర్ న్యూస్, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మౌటం కుమారస్వామి అధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌటం కుమారస్వామి మాట్లాడుతూ.. ఇందిరా ఈజ్ ఇండియా,ఇండియా ఈజ్ ఇందిరా అని గతంలో అనేక మంది మేధావులు కొనియాడిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ అని గుర్తు చేశారు. దేశానికి మరుపురాని సేవలందించిన ఆమె తుపాకీ తూటాలకు బలి కావడం ఎంతో బాధాకరమన్నారు. దేశంలో బ్యాంకు ల జాతీయకరణ తో పాటు ప్రధానిగా విప్లమాత్మక సంస్కరణలు తీసుకువచ్చి పేదలు, దళితులు, మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించారని కొనియాడారు. ఇందిరాగాంధీ తీసుకువచ్చిన ఫలాలను నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు వారి కుటుంబ నేపథ్యమంతా దేశాభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పరితపించిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని భారత ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యమని, ఇందిరాగాంధీ ఆశయాలను భవిష్యత్తులో కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బాలసాని రమేష్, పార్టీ సీనియర్ నాయకులు పోడేటి బిక్షపతి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు రామచందర్, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ , పవన్, కమలాపూర్, హనుమకొండ జిల్లా