పీసా చట్టంపై గ్రామసభ
బయ్యారం, మేజర్ న్యూస్, గిరిజన ప్రాంతాల్లో పిసా చట్టం అమలు,గిరిజన హక్కులు,చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామస్థాయి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఆధ్వర్యంలో బయ్యారం పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో అమలులో ఉన్న చట్టాలు, గ్రామసభ అధికారాలు,ప్రజల హక్కులపై చర్చించారు.గ్రామ పరిధిలో నివాస గృహాలు నిర్మించుకోవాలనుకునే వారు ముందుగా గ్రామ పంచాయతీకి ఇంటి నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తు సమర్పించాలని గ్రామసభ తీర్మానించింది.ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారు కూడా తమ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలతో పంచాయతీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తు చేసుకునే వారికి అవసరమైన వివరాలు,మార్గదర్శకాలు అందించేందుకు పంచాయతీ అధికారులు సిద్ధంగా ఉన్నారని సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ తెలిపారు.గిరిజన ప్రాంతాల్లో చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని,గ్రామసభ నిర్ణయాలు, తీర్మానాలకు అనుగుణంగా ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా సూచించారు.ఈ గ్రామసభలో ఉపసర్పంచ్ ఉమా,పంచాయతీ కార్యదర్శి రాంబాబు,వార్డు సభ్యులు అజయ్,ఉమా,కళింగ రెడ్డి,సరిత, నాయకులు తుపాకుల సతీష్,తాటి జనార్దన్,పులి మల్లయ్య,షేక్ పెద్ద బుజ్జి,శ్రీకాంత్,రాకేష్,కుంజా రమనాదం, రాంబాబు,ప్రమోద్ రెడ్డి,నందగిరి భద్రయ్య,తగిర సత్తిరెడ్డి, చింత కళ్యాణి,ఈర్ప ముని, మేడె బాబు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ;స్వామి ,బయ్యారం మహబూబాద్ జిల్లా