BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ

Select Suryaa Now
పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి  సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ

 పొన్నూరు మేజర్ న్యూస్ :-పొన్నూరు మండలం మాచవరం, మునుకుదురు జడవల్లి, కసుకర్రు, నండూరు గ్రామాలలో  ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త  అంబటి మురళీకృష్ణ  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ , జడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి గ్రామంలోని వివిధ వీధుల్లో పర్యటిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అంబటి మురళీకృష్ణ  మాట్లాడుతూ......  కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 సంవత్సరాలు నిండిన వారికి .4000/- రు పింఛన్ ఇస్తామని, ప్రతి మహిళకు నెలకు 1500/- రు ఇస్తామని, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రజలను  కూటమి ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచిందని విమర్శించారు .అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, హామీల గురించి ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు  ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసే   పార్టీ   ఒక్క వైఎస్ఆర్సిపి పార్టీకే దక్కుతుందని అన్నారు. మీ యొక్క అమూల్యమైన ఓటు ను ఫ్యాన్ గుర్తుకు వేసి  అభ్యర్థులను  అఖండ మెజారిటీతో  గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు చింతలపూడి మురళీకృష్ణ పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ వైఎస్ఆర్సిపి మాజీ మండల అధ్యక్షుడు సీనియర్ నాయకులు రుద్రపాటి ఆదిశేషులు బీసీ పట్టణ అధ్యక్షులు పలగాని రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు , అభిమానులు భారీగా పాల్గొన్నారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- సిలార్