BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్

Select Suryaa Now
ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్

 

మదనపల్లి,మేజర్ న్యూస్ : నాడు దేశం కోసం మాజీ ప్రదానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధిస్తే,నేడు పదవుల కోసం,అధికారం కోసం ఎమర్జెన్సీ విధిస్తూ ప్రజల హక్కులు కాలరాస్తున్నారని అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు.మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను మదనపల్లె పట్టణం,దొంతివీధి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీసీసీ జనరల్ సెక్రెటరీ షేక్ అల్లాబకష్ విచ్చేసారు.పెద్ద సంఖ్యలో విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తల మధ్య ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.‌ఈ సందర్భంగా అల్లాబకష్,ఎస్.రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ నాడు దేశం క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి,తన సమర్థవంతమైన నాయకత్వంతో సంక్షోభాలను అధిగమించడమే కాకుండా,ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరా గాంధీ అని కీర్తించారు.ఇందిరమ్మ గొప్ప నాయకత్వ లక్షణాలు,ప్రజా సంక్షేమం పట్ల అంకితభావం,దేశం పట్ల నిబద్ధత నాటికి,నేటీకి స్ఫూర్తిదాయకమన్నారు.దేశం సంక్లిష్ట సమయంలో దేశాభివృద్ధికి చేసిన సేవలు అమోఘమైనవిగా అభివర్ణించారు.‌గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలను విస్తరించడం,రైతులు,చిన్న పరిశ్రమలు మరియు బలహీన వర్గాలకు సంస్థాగత రుణాల లభ్యతను పెంచడం,కొన్ని ప్రైవేట్ వ్యాపార సమూహాల చేతిలో ఆర్థిక శక్తి కేంద్రీకరణను తగ్గించడం,బ్యాంకింగ్ కార్యకలాపాలను జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చడం,హరిత విప్లవం,ప్రతి ఒక్కరికి కూడు,గూడు,నీడ‌ అనే నినాదంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.స్వతంత్ర సంస్థానాలు విలీనం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమృతేజ,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శరత్ కుమార్ రెడ్డి,ఎన్ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్,స్టేట్ మైనార్టీ వైస్ చైర్మన్ మహమ్మద్ షరీఫ్,స్టేట్ మైనార్టీ సెక్రటరీ హైదర్ ఇల్లాహి,జిల్లా మహిళా మాజీ ఉపాధ్యక్షురాలు మీనా కుమారి,జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ముబారక్ ఖాన్,మదనపల్లి టౌన్ మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ పీర్,రిటైర్డ్ ఎంఈఓ ఈశ్వరయ్య,ఎస్టీ సెల్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సోమశేఖర్,ఎస్సీ సెల్ మాజీ ఉపాధ్యక్షులు రవీంద్ర,కురబలకోట మండల మాజీ అధ్యక్షులు వాసు,మదనపల్లి టౌన్ మాజీ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ,యూత్ కాంగ్రెస్ నాయకులు ఖాసీం వల్లి,అల్లా బకష్,ఎస్సీ నాయకులు నాగరాజ,బీసీ నాయకులు గంగులప్ప,వెంకటరమణ,అస్లాం బాషా,సాదిక్ బాషా,ఖాజావలి,హరి తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి