సాయి కిషోర్ విద్యార్థుల ప్రతిభ.. కామర్స్ కార్నివాల్‌లో విజయం
పలమనేరు మేజర్ న్యూస్ చిత్తూరు సమీపంలోని పీఈఎస్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన కామర్స్ కార్నివాల్ పోటీల్లో పలమనేరు సాయి కిషోర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆరు విభాగాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో కళాశాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తదితర విద్యా విధానాలకు చెందిన పాఠశాలల విద్యార్థులతో పోటీపడి సాయి కిషోర్ విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ముఖ్యంగా ‘మీడియా వర్స్’ విభాగంలో విజేతలుగా నిలిచి కళాశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శైలజ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.కళాశాల కరస్పాండెంట్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. కళాశాల ప్రారంభమైన తొలి సంవత్సరంలోనే విద్యార్థులు వివిధ విభాగాల్లో మంచి ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిరోజూ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి తరగతులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని తెలిపారు. ఈ తరగతుల ఇన్‌చార్జి అమర్‌నాథ్, సీఏ కోఆర్డినేటర్ కృష్ణలను ప్రత్యేకంగా అభినందించారు.పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు, విజేతలు, వారికి శిక్షణ అందించిన అధ్యాపకులు, సహకరించిన తల్లిదండ్రులను చైర్మన్ శైలజ అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు సునీల్ భాషా, శ్రీనివాసులు రెడ్డి నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతుల అధ్యాపక బృందాన్ని ఘనంగా సత్కరించారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్