వట్లూరులో కూటమి అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే చింతమనేని ఎన్నికల ప్రచారం
పెదపాడు, మేజర్ న్యూస్: తమ తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల అభ్యర్థులతో పాటు కూటమిలోని జనసేన బిజెపి అభ్యర్థుల ఎన్నికల ప్రచారాల్లో సైతం రెట్టించిన ఉత్సాహంతో పాల్గొని గ్రామ గ్రామాన వీధి వీధిలో పర్యటిస్తూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూటమీ పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారుస్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాల్లో భాగంగా శనివారం సాయంత్రం పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వట్లూరు ఎంపీటీసీ 2కి జనసేన తరపున కూటమి అభ్యర్థి అయిన ఉప్పు కల్కి రమేష్, అలాగే పెదపాడు జెడ్పిటిసి కి బిజెపి తరఫున కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చౌటుపల్లి విక్రమ్ కిషోర్ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించి, గ్రామంలోని వీధి వీధిలో పర్యటిస్తూ ఓటర్లను కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పల్లెల ప్రగతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కోసం కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు మరడాని రవి, పెదవేగి జడ్పిటిసి సభ్యురాలు చింతమనేని నవ్యశ్రీ, వట్లూరు సొసైటీ చైర్మన్, మండల పార్టీ సెక్రటరీ వేగుంట సురేష్ పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లా ఇన్చార్జి పసుమర్తి రాము ఏలూరు