ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం
మరిపెడ, మేజర్ న్యూస్, ఆరోగ్య రంగంలో శేష వెంకట సత్యనారాయణ ఆచార్యులు చేసిన సేవలు ఆదర్శనీయమని మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ అన్నారు.శనివారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని కనకదుర్గ ఫంక్షన్ హాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి నాయక్ ఆధ్వర్యంలో మల్టీ పర్పస్ హెల్త్ సూపర్‌వైజర్ గా విధులు నిర్వహిస్తున్న ఆచార్యులు పదవీవిరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమని తెలిపారు. విధి నిర్వహణలో ప్రజల మన్ననలు పొందేలా పని చేసేవారు చిర స్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. వెంకటాచార్యులు ఆరోగ్య శాఖలో సుమారు 39 సంవత్సరాల పాటు వివిధ హోదాలలో ప్రజలకు నిరంతరం అత్యుత్త మసేవలు అందించారని కొనియాడారు.విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత,క్రమశిక్షణ తోటి సిబ్బందికి ఆదర్శనీయమని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణకు ఆయన చేసిన కృషిని అభినందించారు. ఆయన విశ్రాంత జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.అనంతరం శేష వెంకట సత్యనారాయణ చార్యులు దంపతులను ఘనంగా సన్మానించి, మెమెంటోను బహూకరించారు. ఈ ఆత్మీయ వీడ్కోలు సభలో డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ పూజిత, డాక్టర్ స్వామి, డాక్టర్ సాగర్, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి గారు, హెల్త్ సూపర్‌వైజర్లు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; చందర్, మరిపెడ మహబూబాబాద్ జిల్లా