గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
కమలాపూర్, మేజర్ న్యూస్, కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులోని వాగు వద్ద గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో కమలాపూర్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అంబాల గ్రామానికి కూకట్ల అజయ్,గూడూరు గ్రామానికి చెందిన పాక రాజు అను ఇద్దరు వ్యక్తులు గంజాయి సేవిస్తూ దొరకడంతో వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు గంజాయి ఎక్కడి నుండి తీసుకువచ్చారు,దాని సరఫరా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నవీన్ తెలిపారు. యువత గంజాయి,ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు అక్రమ విక్రయాలు, సరఫరా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. యువత కాపాడుకునే ప్రయత్నం లో సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి మత్తులో యువత ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని పరిస్థితి లో ఉంటున్నారని,ఈ దేశానికి యువకులే భవిష్యత్తు పునాదులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మధు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; పవన్ ,కమలాపూర్, హనుమకొండ జిల్లా