BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ!

Select Suryaa Now
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ!

కమలాపూర్ , మేజర్ న్యూస్, హనుమకొండ జిల్లా కమలాపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు, శస్త్ర చికిత్సలు తిరిగి పునః ప్రారంభం అయ్యాయని డిసిహెచ్ఓ డాక్టర్ వంశీ తెలిపారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి లో పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత కొన్ని నెలల క్రితం అనివార్య కారణాల వలన ప్రసవాలు ఆగిపోయాయని,పూర్తి స్థాయి వైద్యులు రావడంతో తిరిగి మళ్ళీ ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం కలిగించేందుకు ఇదే ఆసుపత్రి లో శానిటేషన్ వర్కర్ గా పని చేస్తున్న మానస కి తొమ్మిది మాసాలు నిండి నొప్పులు రావడంతో శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. శనివారం ఉదయం స్త్రీల వైద్య నిపుణురాలు డా. ప్రణీత, డా.కిషన్ అధ్వర్యంలో మానస కి పెద్ద శస్త్ర చికిత్స చేశారు. దీంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని,తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని తెలిపారు. గర్భిణీ స్త్రీలు మండలం నుండి దూర ప్రాంతాలకు వెళ్లడం కంటే మనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి లో అనుభవజ్ఞులైన వైద్యులచే నార్మల్ డెలివరీ,పెద్ద శస్త్ర చికిత్సలు చేసుకోవడం ఉత్తమమన్నారు. డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసవాలు పెంచడానికి గ్రామాల్లో ఉన్న మా ఏఎన్ఎం,ఆశా కార్యకర్తలు పూర్తి స్థాయిలో సహాయసహకారాలు అందిస్తారని తెలిపారు. నార్మల్ డెలివరీ లు కావడానికే గర్భిణీలను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ నారాయణరెడ్డి, హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ శ్రీకాంత్ రెడ్డి,కమలాపూర్ సూపరింటెండెంట్ డాక్టర్ చందు నాయక్,ఆర్ఎంఓ డాక్టర్ రవి, డాక్టర్ రవి ప్రవీణ్ రెడ్డి,డాక్టర్ అపర్ణ,డాక్టర్ స్వప్న,డాక్టర్ ప్రావణ్య,డాక్టర్ స్నేహ,డాక్టర్ వరుణ్ మాధవ్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ దుర్గా లోకేశ్వరి, నర్సింగ్ ఆఫీసర్లు స్వప్న,శీభ,సరిత,అనిత కుమారి తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ,పవన్ ,కమలాపూర్, హనుమకొండ జిల్లా