BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం

Select Suryaa Now
పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం

బయ్యారం, మేజర్ న్యూస్ సూర్య,, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఇల్లందు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చెరుకుపల్లి నరేందర్ కోరారు.రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డికి మద్దతుగా నిలిచి ఆయన విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.బయ్యారం మండల కేంద్రంలోని వీబీటీ ఫంక్షన్ హాలులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఎంతో కీలకమని,అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని,మండలంలోని గ్రామాలు,తండాల్లో పర్యటిస్తూ అర్హులైన పట్టభద్రులకు అవగాహన కల్పించాలని కోరారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి ఒక్కరికీ ఎంతో విలువైనదని, ముఖ్యంగా పట్టభద్రుల సమస్యలు,వారి ఆకాంక్షలను శాసనమండలిలో ప్రస్తావించేందుకు పట్టభద్రుల ప్రతినిధుల ఎన్నిక ప్రాధాన్యత కలిగి ఉంటుందని పేర్కొన్నారు.అందువల్ల ఓటరు నమోదును నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని నరేందర్ సూచించారు.ఈ సమావేశం ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు,ఓటరు నమోదు కార్యక్రమంపై నాయకులు చర్చించారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ సుమిత్ కోరి,మండల అధ్యక్షులు మండ నాగరాజు,అందనాల రాజీవ్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ వెంకటపతి,నియోజకవర్గ జర్నరల్ సెక్రటరీ అఖిల్,మండల వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ తదితరులు, యూత్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ ,స్వామి బయ్యారం, మహబూబాబాద్ జిల్లా