పలమనేరు ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్ విజయశేఖర్
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు ఎక్సైజ్ కార్యాలయానికి విచ్చేసిన ఎక్సైజ్ కమిషనర్ విజయ శేఖర్, చిత్తూరు ఎక్సైజ్ డి.పి.ఈ. ఓ శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... క్రైమ్ వర్క్ రివ్యూ చేశారు. ఎన్నికల సందర్భంగా సీల్లు వేయబడిన బార్ గురించి తగు సూచనలు చేశారు. పలమనేర్ ఎక్సైజ్ సీఐ భాగ్యలక్ష్మి, ఎన్ఫోర్స్మెంట్ సీఐలు పవన్ కుమార్, జవహర్ బాబు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. వి కోట మండలంలోని బెరుపల్లి క్రాస్ వద్ద మనోజ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి192 ప్యాకెట్లు సిల్వర్ కప్ కర్ణాటక మద్యం స్వాధీనం ఒకటి ద్విచక్ర వాహనం హీరో ఫ్యాషన్ ప్రో సీజ్ చేయడం జరిగింది. అనంతరం అతన్ని అరెస్టు చేయడం జరిగింది. పొన్నమాకులపల్లి బస్ స్టాప్ వద్ద వడ్డే ప్రసాద్ అనే వ్యక్తి వద్ద 48 ఒరిజినల్ ఛాయిస్ ప్యాకెట్స్, కుక్కల దొడ్డి క్రాస్ వద్ద ముండల కాలనీకి చెందిన మదన్ కుమార్ 48 ఒరిజినల్ చాయిస్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సైలు మస్తాన్ వల్లి, సునీల్ కుమార్ తో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్