గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి
తంబళ్లపల్లి,మేజర్ న్యూస్ : గ్రామాల సమగ్రాభివృద్ధికై త్వరలో జరుగబోవు ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని తంబళ్లపల్లి నియోజకవర్గం టిడిపి ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ పిలుపునిచ్చారు.కూటమి బలపరిచిన తంబళ్లపల్లి మండల జడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ కి మద్ధతుగా శుక్ర,శనివారాలలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.ఇందులో భాగంగా మండలంలోని కొటాల,గోపిదిన్నె,తంబళ్లపల్లి,దండువారిపల్లి,కోటకొండ,రెడ్డికోట కస్పా,కోసువారిపల్లి గ్రామాలలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జి.శంకర్ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలు చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు.800 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది జలాలను హంద్రీ-నీవా కాలువ ద్వారా తంబళ్లపల్లి నియోజకవర్గానికి తీసుకొచ్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు.ఇటీవల మదనపల్లి రూ.లక్ష కోట్లతో శంకుస్థాపన చేసిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమకు తలమానికమన్నారు.2019 నుండి తంబళ్లపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ బాబు సహకారంతో నియోజకవర్గానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.యువకుడు,విద్యావంతుడు,ఉత్సాహవంతుడైన జెడ్పిటిసి అభ్యర్థి అయిన మూడే ప్రశాంత్ నాయక్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం ప్రశాంత్ నాయక్ మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ ఆశీస్సులతో జెడ్పిటిసి బరిలో నిలిచానని,తనకు అవకాశం ఇస్తే తంబళ్లపల్లి మండల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి