- ఒంటరిగా కనిపించిన బాలుడి ని గుర్తించి తల్లి దండ్రులకు సురక్షితం గా అప్ప గించిన పోలీసులు
ఏలూరు, మేజర్ న్యూస్ : త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్రంపాడు ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఒక బాలుడు ఒంటరిగా తిరుగుతూ కనిపించాడు. బాలుడి వెంట కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ రాంబాబు స్పందించి, బాలుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. మహిళా పోలీస్ సిబ్బంది సహకారంతో బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసుల కృషితో బాలుడి తల్లిదండ్రులను గుర్తించి, బాలుడిని వారికి సురక్షితంగా అప్పగించారు. తమ బిడ్డను క్షేమంగా తిరిగి పొందడంతో తల్లిదండ్రులు ఊరట చెందారు.