BREAKING
వాడిలాల్ లాభాల్లో 64% జంప్: ₹463 కోట్లకు చేరిన ఆదాయం షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకున్న నెటిజన్లు: హాంకాంగ్ సిక్సెస్ ట్వీట్‌పై ట్రోలింగ్ జియో ప్లాట్‌ఫామ్స్ లాభాల్లో జోరు: ₹218.8కి పెరిగిన సగటు ఆదాయం క్యూ2 ఫలితాలు: జియో లాభం 8% అప్, పీబీ ఫిన్‌టెక్ లాభాల్లో 43% దూకుడు ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం నేటి పంచాంగం 30 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –30 అక్టోబర్ 2026 గెలుపు నీదనయ్య శంకర -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం ఏసీ గదిలో గంటల తరబడి ఉంటున్నారా? మీ చర్మం మరియు కళ్లపై పడే తీవ్ర ప్రభావాలు ఇవి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం

వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు

Select Suryaa Now
వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు

ఖానాపూర్, మేదర్ న్యూస్, ఖానాపూర్ మండలానికి ఆరాధ్య దైవమైన పాకాల చెరువు నీళ్లు వృధాగా వాగులో నుండి క్రిందికి వెళ్లిపోతుండటంపై ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తైబందీ ఖరారు అయిన తుంగబంధం కాలువలో చుక్క నీరు రాక వరి సాగు చేసుకున్న రైతుల పొలాలకు నీళ్లు లేక రైతులు అవస్థలు పడుతుంటే ఎలాంటి సాగులేని పాకాల వాగు మాత్రం ద్వారకపేట రేవు వద్ద మనుషులు దాటలేనంత ఉధృతంగా ప్రవహిస్తూ వృధాగా పోతోందని, ఈ వృధా నీటిని సంబంధిత శాఖ అధికారులు, చొరవ తీసుకొని అరికట్టాలని సర్పంచ్ దాసరి రమేష్ డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న నిల్వ నీటిని ఈ విధంగా వృధా చేస్తే రాబోయే రోజుల్లో మనుషులకు తాగునీటికే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయి తాగునీటి ఎద్దడి తప్పదని, కాబట్టి ప్రతి చుక్క నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, వెంటనే కలెక్టర్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వాగులోకి పోతున్న నీటిని ఆపి తుంగబంధం కాలువ ద్వారా రైతుల పొలాలకు మళ్లించాలని లేదా చెరువులోనే నిల్వ ఉంచి భవిష్యత్తు తాగునీటి అవసరాలకు వినియోగించాలని సర్పంచ్ దాసరి రమేష్ కోరారు.

రిపోర్టర్ :అనిల్ కుమార్ ,ఖానాపూర్ వరంగల్ జిల్లా