రాంలీలా మైదానంలో జరిగే ధర్నాకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు
మియాపూర్, శేరిలింగంపల్లి: ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల సంరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న భారీ ధర్నాలో పాల్గొనేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరారు.కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ పోరాటానికి మద్దతుగా నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లాయి. ఈ సందర్భంగా ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల బస్సును శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి వి. జగదీశ్వర్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటంలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరందర్ గౌడ్, రాములు గౌడ్, వెంకట్ రెడ్డి, కావూరి ప్రసాద్, రవీందర్ రెడ్డి, కట్ల శేఖర్ రెడ్డి, మన్నేపల్లి సాంబశివరావు, మల్లికార్జున్ యాదవ్, హనుమంతు, మునాఫ్ ఖాన్, రాంచందర్ గౌడ్, రాజేష్, కాశీ, జంగీర్, జుబేర్, శివకుమార్, భరత్, రవికుమార్ గౌడ్, రిజ్వాన్, వెంకటేష్, జలీల్, మహేష్, ఖాజా,శేరిలింగంపల్లి నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షుడు నర్సింగ్ రావు, శివ, కాశప్ప, వెంకటేష్, మోహన్ రాజు, గోవింద్, సయ్యద్, ఆరిఫ్, ఇమ్రాన్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు చంద్రమౌళి, షరీఫ్, ఇర్ఫాన్, ఇస్మాయిల్, ఆసిఫ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.