సురక్షిత రవాణాకు సైబరాబాద్ మూవ్స్–2026 నవంబర్ 26 నుంచి టీ-హబ్‌లో ప్రత్యేక కార్యక్రమం
గచ్చిబౌలి,మేజర్ న్యూస్ : నగర రవాణా వ్యవస్థను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నవంబర్ 26 నుంచి 28 వరకు టీ-హబ్‌లో ‘సైబరాబాద్ మూవ్స్–2026’ నిర్వహించనున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, ఎస్‌సీఎస్‌సీ, షిఫ్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఇనిషియేటివ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ.. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు అందరికీ అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ అవసరమన్నారు.అనంతరం సీఎంసీ కమిషనర్ జి. సృజన మాట్లాడుతూ.. ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధి, రహదారుల మెరుగుదల, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజల కోసం మొబిలిటీ ఇన్నోవేషన్ ఛాలెంజ్ నిర్వహించనున్నారు. నగర రవాణా మ్యాపులు, డేటా ప్రదర్శనలు, నిపుణుల చర్చలు కూడా ఏర్పాటు చేయనున్నారు.ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు, CMC అధికారులు, పోలీస్ ట్రాఫిక్ విభాగాల అధికారులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పౌర సమాజ ప్రతినిధులు, పారిశ్రామిక రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.