బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్
దేవరుప్పుల , మేజర్ న్యూస్, భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ నియమితులయ్యారు. గతంలో బీజేవైఎం మండల నాయకుడిగా పనిచేసిన తనకు పార్టీ మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అన్వేష్ నాయక్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, బీజేవైఎం బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు. యువతను పార్టీ వైపు ఆకర్షిస్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన బీజేవైఎం జనగామ జిల్లా అధ్యక్షుడు హరీష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్, రాష్ట్ర నాయకుడు లేగ రామ్మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చింత సృజన్ కుమార్, దేవరుప్పుల మండల బీజేపీ అధ్యక్షుడు బస్వ భాస్కర్‌లకు అన్వేష్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రిపోర్టర్: ఎల్లేష్, దేవరుప్పుల, జనగామ జిల్లా