BREAKING
ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం నేటి పంచాంగం 30 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –30 అక్టోబర్ 2026 గెలుపు నీదనయ్య శంకర -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం ఏసీ గదిలో గంటల తరబడి ఉంటున్నారా? మీ చర్మం మరియు కళ్లపై పడే తీవ్ర ప్రభావాలు ఇవి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి...

Select Suryaa Now
 సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి...

                        వృద్ధులకు అవగాహన కల్పించిన జోనల్‌ కమిషనర్‌ అమిత్‌ నారాయణ,ఇన్స్పెక్టర్ ఏ.శ్రీధర్ కుమార్
చందానగర్,మేజర్ న్యూస్ : సైబర్‌ నేరగాళ్ల మాయమాటలకు మోసపోవద్దని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శేరిలింగంపల్లి  జోనల్‌ కమిషనర్‌ అమిత్‌ నారాయణ ఐఏఎస్‌,చందానగర్ ఇన్స్పెక్టర్  ఏ. శ్రీధర్‌ కుమార్‌ సూచించారు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు సైబర్‌ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు చందానగర్ లోని పీజేఆర్‌ స్టేడియంలో సాయంత్రం వాకింగ్‌కు వచ్చే వారిని ఉద్దేశించి సుమారు 60 మంది పాల్గొన్న సైబర్‌ క్రైమ్‌ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జోనల్‌ కమిషనర్‌ అమిత్‌ నారాయణ వివిధ రకాల సైబర్‌ మోసాల గురించి వివరించారు.డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో చేసే మోసాలు, ఓటీపీ ఫ్రాడ్స్‌, అపరిచిత మొబైల్‌ యాప్‌ల ద్వారా జరిగే మోసాలు, నకిలీ వీడియో కాల్స్‌, ఇతర ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయవద్దని వివరించారు. సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వృద్ధులకు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు, డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించే సమయంలో అప్రమత్తత అవసరమని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో మియాపూర్‌ సర్కిల్‌ మున్సిపల్‌ అధికారులు, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజల్లో సైబర్‌ నేరాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.