పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ ; ఎస్వీయూలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా కాంపిటీటివ్ సెల్ ఏర్పాటు చేసి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణను అందించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వీసీ టాటా నర్సింగరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎన్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యాక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న అనేకమంది విద్యార్థులు యూజీసీ సీఎస్ఐర్ నెట్, గ్రూప్స్, ఎస్ఎస్స్సీ, బ్యాంకింగ్, రైల్వే తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. అయితే సరైన శిక్షణ, స్టడీ మెటీరియల్ అందుబాటులో లేకపోవడంతో అనేకమంది విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేధన వ్యక్తం చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ఆర్థిక భారం పడుతూ అప్పుల పాలవుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలోనే నిపుణులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి, ఉచిత స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు, ఆన్లైన్ పరీక్షల సదుపాయాలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నేతలు వినోద్, నరసన్న, తిప్పే స్వామి, మహేష్ బాబు, అంజి, ప్రవీణ్ పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్