BREAKING
వాడిలాల్ లాభాల్లో 64% జంప్: ₹463 కోట్లకు చేరిన ఆదాయం షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకున్న నెటిజన్లు: హాంకాంగ్ సిక్సెస్ ట్వీట్‌పై ట్రోలింగ్ జియో ప్లాట్‌ఫామ్స్ లాభాల్లో జోరు: ₹218.8కి పెరిగిన సగటు ఆదాయం క్యూ2 ఫలితాలు: జియో లాభం 8% అప్, పీబీ ఫిన్‌టెక్ లాభాల్లో 43% దూకుడు ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం నేటి పంచాంగం 30 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –30 అక్టోబర్ 2026 గెలుపు నీదనయ్య శంకర -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం ఏసీ గదిలో గంటల తరబడి ఉంటున్నారా? మీ చర్మం మరియు కళ్లపై పడే తీవ్ర ప్రభావాలు ఇవి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం

ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు

Select Suryaa Now
ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ ; ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భాగంగా చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బాలబాలికల కరాటే ఎంపిక పోటీలు శుక్రవారం శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా జిల్లా క్రీడా శాఖ అభివృద్ధి అధికారి ఎన్.శశిధర్ హాజరై క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారు. జిల్లా నలుమూలల నుండి 400 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

21 మంది రాష్ట్రస్థాయికి ఎంపిక

ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిలో బాలికలు 10 మంది, బాలురు 11 మంది చొప్పున మొత్తం 21 మందిని ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన వారు త్వరలో జరగనున్న ఎస్ ఎఫ్ జి రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు చిత్తూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని అండర్-19 సెక్రెటరీ లోకనాథం, అండర్-14, 17 సెక్రటరీలు సాంబశివరావు, అమ్ములు తెలియజేశారు.ఎంపిక కమిటీ సభ్యులుగా ఇస్మాయిల్, రత్నాకర్, నవీన్, కన్నయ్య, వెంకటేశ్వర్లు, కుమార్, భువనేశ్వర్, ఖాదర్ బాషా, సదాశివ వ్యవహరించారు. చిన్న వయసులోనే కరాటేలో రాణిస్తున్న ఈ చిన్నారులకు జిల్లా క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్