BREAKING
వాడిలాల్ లాభాల్లో 64% జంప్: ₹463 కోట్లకు చేరిన ఆదాయం షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకున్న నెటిజన్లు: హాంకాంగ్ సిక్సెస్ ట్వీట్‌పై ట్రోలింగ్ జియో ప్లాట్‌ఫామ్స్ లాభాల్లో జోరు: ₹218.8కి పెరిగిన సగటు ఆదాయం క్యూ2 ఫలితాలు: జియో లాభం 8% అప్, పీబీ ఫిన్‌టెక్ లాభాల్లో 43% దూకుడు ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం నేటి పంచాంగం 30 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –30 అక్టోబర్ 2026 గెలుపు నీదనయ్య శంకర -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం ఏసీ గదిలో గంటల తరబడి ఉంటున్నారా? మీ చర్మం మరియు కళ్లపై పడే తీవ్ర ప్రభావాలు ఇవి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం

త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ

Select Suryaa Now
త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం  -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ

ఎడ్యుకేషన్ స్టాప్ రిపోర్టర్ :

డివిజన్ లో ప్రధాన సమస్యగా మారిన త్రాగునీటి, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తానని 62వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బండారు పార్థసారథి హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా గత ఐదు రోజుల నుంచి జరిగిన ప్రచార పర్వం నేటితో ముగిసింది. ఇందులో భాగంగా శుక్రవారం 62వ డివిజన్ పరిధిలోని సాయి నగర్, విజయపురం, అంబేద్కర్ కాలనీ, రాఘవేంద్ర నగర్, సత్యనారాయణపురంలో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బండారు పార్థసారథి విస్తృత ప్రచారం చేశారు. ప్రతి గడపకు వెళ్లి అమ్మ ఏమన్నా సమస్యలు ఉన్నాయా చెప్పాలని కోరారు. ఏ సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంకు రైన్ వాటర్ స్టోరేజ్ కి అనుకూలమైన విజయపురం కాలువకు ప్రత్యేక నిధులతో అండర్ గ్రౌండ్ స్టోరేజ్ బ్యాంకు నిర్మిస్తానని తెలిపారు. ప్రతి ఇంటి వద్ద తాగునీటి ఎద్దడి తీర్చేందుకు ప్రత్యేక స్టోరేజ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధిలో భాగంగా డివిజన్ లో కాలువలు, డ్రైనేజీలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ వ్యవస్థపై పూర్తి నిర్లక్ష్యం వహించారని, 2014-19 టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులను తొలగించారని, అర్హులైన పింఛన్లు, విద్యా దీవెన పథకాలు అందలేదని స్థానికులు వాపోయారని ఆయన అన్నారు. గెలిచిన వెంటనే ప్రజా సమస్యలన్నిటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. ఆదివారం జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి తరఫున మేయర్ గా పోటీ చేస్తున్న జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అలాగే 62వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న తనకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మల్లకుప్పం శేఖర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు శరత్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పెనుబాల హర్షవర్ధన్, 62వ డివిజన్ ప్రెసిడెంట్ శాఖమూరి తిరుమల నాయుడు, కోనంగి శ్రీరాములు, శ్యామలమ్మ, నాగరాజు నాయుడు, టీడీపీ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ తరపున ఎన్డీఏ కూటమి శ్రేణులు, జనసేన సేవాదళ్ సభ్యుడు పెంచులయ్య, మనోజ్, అనిల్, కుమార్, ముఖేష్ పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్