ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపు కోసం కూటమినేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. గత వారం రోజులుగా సాగిన ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. శుక్రవారం 54వ డివిజన్ ప్రచార కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి మేర అభ్యర్థి జేబీ శ్రీనివాస్, డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరై ఇంటింటికి తిరిగి కూటమి అభ్యర్థులు గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నగర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తిరుపతి నగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన పారిశుద్ధ్యం, తాగునీరు, అంతర్గత రహదారుల అభివృద్ధికి కూటమి అభ్యర్థుల గెలుపు ఎంతో కీలకమన్నారు. మేయర్ అభ్యర్థి జేబి శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, 54వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్ పరిధిలో ప్రతి గడపకూ కూటమి మేనిఫెస్టో, అభివృద్ధి ఆశయాలను చేరవేసేలా ప్రత్యేక ప్రచార వాహనాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య నాయకులు, 54వ డివిజన్ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రచారానికి విచ్చేసిన డాలర్స్ దివాకర్ రెడ్డికి, మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు క్రికెట్ విజయకుమార్, సుధాకర్ రావు, ఢిల్లీ, స్థానిక మహిళలు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్