BREAKING
వాడిలాల్ లాభాల్లో 64% జంప్: ₹463 కోట్లకు చేరిన ఆదాయం షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకున్న నెటిజన్లు: హాంకాంగ్ సిక్సెస్ ట్వీట్‌పై ట్రోలింగ్ జియో ప్లాట్‌ఫామ్స్ లాభాల్లో జోరు: ₹218.8కి పెరిగిన సగటు ఆదాయం క్యూ2 ఫలితాలు: జియో లాభం 8% అప్, పీబీ ఫిన్‌టెక్ లాభాల్లో 43% దూకుడు ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం నేటి పంచాంగం 30 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –30 అక్టోబర్ 2026 గెలుపు నీదనయ్య శంకర -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం ఏసీ గదిలో గంటల తరబడి ఉంటున్నారా? మీ చర్మం మరియు కళ్లపై పడే తీవ్ర ప్రభావాలు ఇవి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం

ప్రత్యేకావసరాల పిల్లలకు అండగా ప్రత్యేక యాప్

Select Suryaa Now
ప్రత్యేకావసరాల పిల్లలకు అండగా ప్రత్యేక  యాప్

చిట్యాల, మేజర్ న్యూస్, పాఠశాల విద్యార్థుల అంగవైకల్యాన్ని  గుర్తించేందుకు కేంద్ర విద్యా శాఖ రూపొందించిన ప్రశస్త్‌ యాప్‌ విద్యార్థులకు అండగా నిలువనుందని మండల విద్యాశాఖ అధికారి కొడపాక రఘుపతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎన్సీఈఆర్ టి ఆదేశాల మేరకు   అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ... అంగవైకల్యం ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన విద్యావనరులు, ప్రభుత్వ సహాయం అందించేందుకు ఎన్‌సీఈ ఆర్‌టీ రూపొందించినదే 'ప్రశస్త్‌' మొబైల్‌ యాప్‌ అని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలతో పాటు గురుకుల, కేజీబీ విద్యాలయాల్లో ప్రశస్త్‌ యాప్‌ ద్వారా 21 రకాల వైకల్యాలను పరీక్షించేందకు ఈ యాప్‌ను ఉపయోగిస్తారన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను పాఠశాల స్థాయి లోనే గుర్తించడం ద్వారా వారికి మెరుగైన వైద్యం అందించడానికి సిఫారసు చేయడం,  వైకల్య సర్టిఫికెట్‌ తీసుకోవడానికి సలుభం అవుతుందని పేర్కొన్నారు.  దివ్యాంగుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించాలని చెప్పారు. బహుళ ప్రయోజనాలున్న ప్రశస్త్‌ యాప్‌ను ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎడ్యుకేటర్ రాజేష్, ఐఈ ఆర్ పిలు సంద మహేందర్, చిక్కుల నరేష్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయ, ఉపాధ్యాయురాళ్లు పాల్గొన్నారు.

రిపోర్టర్; సదానందం, చిట్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా