చిట్యాల ను కరువు మండలంగా ప్రకటించాలి
చిట్యాల, మేజర్ న్యూస్, తీవ్ర వర్షా భావంతో అల్లాడుతున్న చిట్యాల మండలాన్ని జిల్లా అధికారులు కరువు మండలంగా ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొల్లూరి అశోక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో వర్ష భావంతో సాగు విస్తీర్ణం తగ్గడం పంటల దిగుబడి తగ్గి పంటలపై పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అని మండల రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. నిబంధన ప్రకారం రైతులకు కూలీలకు నిరుపేదలకు, పశువులకు పశుగ్రాసం, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులు కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సకాలంలో సహాయ చర్యలు చేపట్టి అమలు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో చిట్యాల మండలాన్ని చేర్చి, కరువు మండలంగా ప్రకటించి రైతులను, నిరుపేదలను, కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జేరీపోతుల ఓదేలు మాదిగ, నోముల శివశంకర్ మాదిగ, మండల నాయకులు సిరిపెళ్లి తిరుపతి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ;సదానందం ,చిట్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా