రక్తదానం ప్రాణదానం తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం విజయవంతం
మనోరహాబాద్ : రక్తదానం ప్రాణదానమని జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ తెలిపారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సహాయపడే ఉద్దేశంతో మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం మనోహరాబాద్‌లోని శుభం ఫంక్షన్ హాల్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తానని రక్త దానం చేయడం వల్ల మరొకరి ప్రాణం నిలుస్తుందని అన్నారు. రక్తదానం చేస్తే వారం రోజుల్లో మళ్లీ రక్తం తయారవుతుందని ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్, సీఐ వెంకటరాజ గౌడ్ ఎస్ఐ సుభాష్ తూప్రాన్ ఎస్ఐ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.ఈ రక్తదాన శిబిరంలో సర్కిల్ ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యువకులు, స్వచ్ఛంద సేవకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ శిబిరంలో మొత్తం 113 మంది రక్తదానం చేసి తలసేమియా చిన్నారులకు అండగా నిలిచారు. రక్తదానం ఒకరి ప్రాణాలను కాపాడటమే కాకుండా, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆశను అందిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకుని, అవసరమైన వారికి సహాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ఉన్నతాధికారులు, సర్కిల్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు చిట్కుల మహిపాల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు విట్టల్ రెడ్డి, పెంట గౌడ్, కళ్యాణ్, బిక్షపతి, మహేందర్, పురం రవి, ప్రజాప్రతినిధులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.