ఆధ్యాత్మిక చింతన తోనే మానసిక ప్రశాంతత. బసవ కళ్యాణ్ పీఠాధిపతి శ్రీ మాధవానందా సరస్వతి స్వామి వారు.
పెద్ద శంకరంపేట ; పెద్ద శంకరం పేట మండల కేంద్రానికి సమీపం లో ఉన్న ప్రముఖ స్వయంభూ శైవ క్షేత్రం కొప్పోల్ ఉమా సంగమేశ్వర స్వామి వారి ఆలయం లో శ్రీ సహజానంద సరస్వతి స్వామి వారి 16 వ వార్షిక ఆరాధన కార్యక్రమం లో ప్రత్యేక పూజ లో పాల్గొన్న బసవ కళ్యాణ్ పీఠాధిపతి శ్రీ మాధవానందా సరస్వతి స్వామి వారు భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. భక్తులు తరచూ ఆలయాలు సందర్శిస్తూ ధార్మిక చింతన కలిగి ఉండాలని సర్వ ప్రాణుల పట్ల ప్రేమాభిమానములు కలిగి ఉండాలని హితబోధ చేశారు. ఈ ప్రత్యేక పూజ yg లో నాచారం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి స్వామి వారు మరియు బ్రాహీభూత సహజానంద సరస్వతి స్వామి వారి పూర్వాశ్రమ జ్యేష్ట కుమారుడు ప్రముఖ వేద పండితులు , చండీ ఉపాసకులు నరహరి శర్మ గారు దైవిక క్రతువు నిర్వహించారు. రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షులు గుడి చంద్ర శేఖర్,రాఘవేంద్ర చారి. సంతోష్ కుమార్,ప్రముఖ వేద పండితులు శిలాంకోట. ప్రవీణ్ శర్మ, గుడి. శ్రీనాథ్, శ్రీనందన్, బోగయ్యగారి. నాగరాజు శర్మ, ఆలయ పూజారి సంగప్ప మరియు స్వామివారి శిష్యులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు....