BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

ఎన్నికల కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి

Select Suryaa Now
ఎన్నికల కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి

 

బొబ్బిలి, అక్టోబర్ 28: మేజర్ న్యూస్:బొబ్బిలి పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సౌకర్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. అనంతరం బొబ్బిలి పురపాలక కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ ఏర్పాట్లు పారదర్శకంగా జరగాలని ఎన్నికల అధికారి రామలక్ష్మికి సూచించారు. ఆయన వెంట బొబ్బిలి ఆర్డీవో రామ్మోహన్ ఉన్నారు.

* తుఫాను ప్రభావాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్:ఆర్నాబ్ తుఫాను ప్రభావాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారాది వంతెన వద్ద నీటి ఉధృతిని, పెద్ద గెడ్డ, ఒట్టి గెడ్డలలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. పెద్ద గెడ్డలో ప్రవాహం ప్రమాద స్థాయికి చేరలేదని, ఒట్టి గెడ్డలో ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల పారాది వద్ద నీటి వేగం పెరిగిందని ఆర్డీవో రామ్మోహన్ వివరించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, జలాశయాల నుండి నీటిని విడుదల చేసే ముందు దిగువ ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.