BREAKING
చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన* దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో సురేష్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులకు ఉచిత భోజనం అందించాలి ప్రతిరోజూ పండ్లు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ - 29 నేరాలు వెలుగులోకి మాటలు చెప్పను అభివృద్ధి చేసి చూపిస్తా -60వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి చేతులు కడుక్కోవడంలో ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే! రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి* అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం

విడుదల బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

Select Suryaa Now
విడుదల బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఅర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మండపేట పట్టణంలోని పలు వార్డులలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా సమీక్షించి, రహదారుల మీద పడిన చెట్లను తొలగించి, మురుగునీరు సాఫీగా బయటకు వెళ్లేలా డ్రైనేజీ పూడికతీత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పట్టణ పర్యటన అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల ఏడిదలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న తుఫాన్ బాధితులను ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు స్వయంగా భోజన వసతి, త్రాగునీరు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీటితో పాటు వైద్య శిబిరాలను నిర్వహించి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.