BREAKING
చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన* దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో సురేష్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులకు ఉచిత భోజనం అందించాలి ప్రతిరోజూ పండ్లు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ - 29 నేరాలు వెలుగులోకి మాటలు చెప్పను అభివృద్ధి చేసి చూపిస్తా -60వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి చేతులు కడుక్కోవడంలో ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే! రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి* అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి

Select Suryaa Now
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం అర్నాబ్ తుపాను ప్రభావంతో నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరంలో నీట మునిగిన పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. జోరువానను సైతం లెక్కచేయకుండా దానవాయిపేట, ప్రకాశంనగర్, నారాయణపురం, కంబాలపేట, ఆర్ట్స్ కళాశాల వెనుక ప్రాంతం, అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల పరిసర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాలను సందర్శించారు. వర్షపు నీటితో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగిన నేపథ్యంలో సంబంధిత అధికారులతో మాట్లాడి, రహదారులపై పడిన చెట్లను తక్షణమే తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని వీలైనంత త్వరగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ, వర్షపు నీరు సజావుగా బయటకు వెళ్లేలా చూడాలని స్పష్టం చేశారు.భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వైర్లు దెబ్బతిన్నందున వాటిని వెంటనే పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, అలాగే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినా, స్తంభాలు దెబ్బతిన్నా వెంటనే స్పందించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ, పారిశుధ్య విభాగం, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలు, కూలిన చెట్లు, విద్యుత్ అంతరాయాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

తుపాను ప్రభావం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. అత్యవసరమైతే తప్ప భారీ వర్షాల సమయంలో బయటకు రావద్దని, నీరు ప్రవహిస్తున్న రహదారులు, లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లవద్దని తెలిపారు. తెగిపడిన విద్యుత్ తీగలు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, నేలకొరిగిన చెట్ల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారుల సూచనలు పాటిస్తూ అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత శాఖలకు సమాచారం అందించాలని కోరారు. తుపాను ప్రభావం తగ్గే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య, ముస్లిం మైనారిటీ నాయకులు మహ్మద్ అబ్దుల్లా తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.