తూప్రాన్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం-2026
తూప్రాన్: తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద విజిలెన్స్ అవగాహన వారోత్సవం – 2026 సందర్భంగా మెదక్ జిల్లాలోని తూప్రాన్ పట్టణంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సనత్‌నగర్ డివిజనల్ మేనేజర్ ఎం. మహేష్ బాబు ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో భాగంగా అవినీతి నిర్మూలనలో సామాన్య పౌరుల బాధ్యతలు, నిజాయితీ ప్రాముఖ్యత మరియు అవినీతిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం గురించి వివరించారు .అనంతరం గ్రామసభలో పాల్గొన్న వారందరితో నిజాయితీ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన మేనేజర్లతో పాటు, తెలంగాణ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ గిడ్డంగి మేనేజర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.