BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

పాండ చెరువు కట్టపై సీసీ రోడ్డు పనులు ప్రారంభం మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా

Select Suryaa Now
పాండ చెరువు కట్టపై సీసీ రోడ్డు పనులు ప్రారంభం   మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా

రామాయంపేట ;రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని పాండ చెరువు కట్ట వద్ద కళ్యాణ రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డు పనులను మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్త ప్రారంభించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాల మేరకు, మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు సౌకర్యం మెరుగుపరిచేందుకు ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా గజవాడ నాగరాజు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పోచమ్మ గణేష్, బిజెపి కౌన్సిలర్ శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు డాకి స్వామి కళ్యాణ రామచంద్రస్వామి ఆలయ కమిటీ సభ్యులు మధునాల స్వామి గౌడ్ నవాత్ మహేష్ పటేల్ రాము నవాత్ నవీన్ సుధాకర్ ప్రభాకర్ శ్రీనివాస్ గోపి తో పాటుతదితరులు పాల్గొన్నారు.