ట్రెండ్స్ పాఠశాలలో నెట్ బాల్ కోర్టు ప్రారంభం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మంగళం ఫ్రెండ్స్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన నెట్ బాల్ కోర్టును ప్రధానోపాధ్యాయులు మురళి బుధవారం ఘనంగా ప్రారంభించారు. క్రీడాకారులకు అన్ని విధాలుగా ఉపయోగపడేందుకు దీనిని ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో జరిగే స్కూల్ గేమ్స్ పోటీలలో విజయం సాధించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్ర జాతీయ పోటీలకు ఎంపికవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పి.డీలు సాంబశివరావు, సురేష్, రూపలత, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రాజశేఖర్, కుమార్, వసుంధర, జయశ్రీ క్రీడాకారులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్