ఐఐటిఈ- అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమం
తూప్రాన్ ; తూప్రాన్ గీతా పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మ్యాథ్స్ మరియు సైన్స్ విభాగాల్లో విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ వారికి తగు సూచనలిస్తూ భవిష్యత్తులో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ఈ అభ్యాస్ అకాడమీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల చైర్మన్ ఉష మాట్లాడుతూ.. ఈ అభ్యాస్ అకాడమీ విద్యార్థులకు ఒక వరం లాంటిదని అన్నారు. భవిష్యత్తులో పోటీని ఎదుర్కునేలా ఆ అభ్యాస్ తర్ఫీదునిస్తుందని అన్నారు.
కార్యక్రమంలో ఈ అభ్యాస్ ఫౌండర్ భువనగిరి పవన్ ఫణి శాస్త్రి, కరెస్పాండంట్ రామాంజనేయులు, డైరెక్టర్లు భరత్, డాక్టర్ మౌనిక ప్రిన్సిపాల్ అరుణ, ప్రేమ్ రాజ్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
.