35వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇందులో భాగంగా 35వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికులతో కలిసి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరిస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో శంకర్, అక్బర్, నీలకంఠ, శీనతో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్