BREAKING
అనురాగ్‌ రోవర్‌ ఫీల్డ్‌ టెస్టింగ్‌ సక్సెస్‌ అసంపూర్తిగా చెర్లగూడ వంతెన! వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ వెనుక ఆ సినిమా డైలాగ్ మ్యాజిక్.. అసలు రహస్యం విప్పిన అభిషేక్ శర్మ కీసరలో అక్రమ మట్టి తవ్వకాలపై విజిలెన్స్ మెరుపు దాడులు.. ఎక్స్‌కవేటర్, మూడు టిప్పర్లు సీజ్ రక్తదానం ప్రాణదానంతో సమానం... మంగ్రాస్పల్లి సర్పంచ్ స్వప్న రమేష్  నాగార్జున వందో సినిమా టైటిల్ మారుతోందా.. ఖైదీ100 పేరు పరిశీలనలో ఉందా 21వ వార్డులో టీడీపీ అభ్యర్థి జి.కె. మణి ప్రచార జోరు నిహారిక కొణిదెల నిర్మాణంలో నయా మూవీ: ఆసక్తికరంగా 'పాకెట్ రాకెట్స్' టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి* గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ ఎస్టీ కమిషన్ కృషి నీళ్లు..కరెంటు లేక రైతులు ఆగం - ఎండిన పొలంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడలో కార్డన్ సెర్చ్ *106 బైకులు, 4 ఆటోలు, కారు స్వాధీనం 31వ వార్డు అభ్యర్థిని గెలిపించండి... మాండ్ర ఫోక్సో చట్టం పై విద్యార్థులకు అవగాహన ఆ విషయంలో నేను మరింత అప్రమత్తంగా ఉండాల్సిందంటూ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు

130 మంది రక్తదానం

Select Suryaa Now
130 మంది రక్తదానం

సూర్య ప్రతినిధి, ఒంగోలు : పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు సేవాభావాన్ని చాటుకున్నారు. జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం ఒంగోలు పోలీసు కల్యాణ మండపంలో పోలీసు సిబ్బందికి వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ ఎన్.యుగంధర్ బాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి.నాగేశ్వరరావు శిబిరాన్ని ప్రారంభించారు. పోలీసు సంక్షేమంలో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరంలో సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎన్.యుగంధర్ బాబు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు, రక్షణ, శాంతియుత వాతావరణం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల స్ఫూర్తితో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, ప్రసవ సమయాలు, ప్రాణాంతక వ్యాధులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. అత్యవసర సమయంలో రక్తదానం చేయడం ద్వారా ఒకరి ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ శిబిరంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి.నాగేశ్వరరావుతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మొత్తం సుమారు 130 మంది రక్తదానం చేశారు. రక్తదాతలకు పండ్ల రసాలు, బిస్కెట్లు అందజేశారు. సామాజిక బాధ్యతతో రక్తదానానికి ముందుకు వచ్చిన వారిని అడిషనల్ ఎస్పీ అభినందించి ధ్రువపత్రాలు అందజేశారు.

పోలీసు విధులు నిరంతరం కష్టతరంగా ఉంటాయని, ప్రజా భద్రతకు ప్రాధాన్యమిస్తూ సిబ్బంది తరచూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఉంటాయని అడిషనల్ ఎస్పీ తెలిపారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందడంతో పాటు మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు.

కార్యక్రమంలో ఎఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ, ట్రాఫిక్ సీఐ హాజరత్తయ్య, ఆర్‌ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, పోలీసు యూనిట్ వైద్యులు శ్రీనివాసరావు, పీటీసీ వైద్యురాలు డాక్టర్ సుధ, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ సందీప్ శ్రీనివాస్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.